- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ న్యూస్: అభ్యర్థుల రిపోర్ట్ రెడీ చేసిన థాక్రే.. T- కాంగ్రెస్‌లో తెరపైకి కొత్త చర్చ..?!
ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీ మాణిక్‌రావు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీ మాణిక్‌రావు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, ములుగు, హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే ఆయన ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ నివేదిక తయారు చేస్తున్నారు. ఈ రిపోర్టును ఢిల్లీకి పంపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌నేతల్లో టెన్షన్మొదలైంది. థాక్రే ఢిల్లీకి పంపించే రిపోర్టులో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లు ఉన్నాయంటూ గాంధీభవన్‌లో హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతున్నది. దీంతో ఆ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయోనని ఇంచార్జీలు, కీలక లీడర్లు ఉత్కంఠతో ఉండటం గమనార్హం. అయితే థాక్రే మాత్రం రహస్యంగా వివిధ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ కావడం కాంగ్రెస్‌వర్గాల్లో కలవరం కనిపిస్తోన్నది.
Next Story






