- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meenakshi Natarajan: హెచ్ సీయూ భూముల వివాదంపై ఏఐసీసీ ఫోకస్.. నేడు హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్
ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి నటరాజన్ మీనాక్షి ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ సీయూకు (HCU) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల (Kancha gachibowli Lands) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏఐసీసీ (AICC) వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె నగరానికి చేరుకుని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన కమిటీతో సాయంత్రం భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్ఎస్ యూఐ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే కంచగచ్చిబౌలి భూముల వివాదానికి తెరదించేలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరో వైపు ఈ వ్యవహారం పై సీఎస్ అటవీ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. అయితే ఈ భూముల వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపుతున్న వేళ ఏఐసీసీ ఇన్ చార్జి రాష్ట్రానికి రాబోతుండటం ఆసక్తిగా మారింది.
పదవులపై క్లారిటీ వచ్చేనా?:
అధికార కాంగ్రెస్ (Congress) లో మంత్రి వర్గ విస్తరణ (Cabinet Expansion), నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి రావడం లేదు. వీటి విషయంలో వాయిదాల పర్వం పార్టీ నాయకులు, శ్రేణులను తీవ్ర నిరుత్సాహపరుస్తోంది. ఇప్పటికే కసరత్తు, అధిష్టానంతో రాష్ట్ర నేతల చర్చలు పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ అంశంలో ముందడుగు పడటం లేదు. ఉగాది నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించినా ఎమ్మెల్యేల నుంచి కొత్త ప్రతిపాదనలు రావడం సమస్యను మరింత జటిలంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటనకు వస్తున్న మీనాక్షి నటరాజన్ మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం సాధించగలుగుతుందా? ప్రభుత్వానికి, పార్టీపై విమర్శలకు కారణం అవుతున్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏదైనా అధిష్టానం తరఫున సూచన చేస్తారా అనేది టీ కాంగ్రెస్ లో ఉత్కంఠగా మారింది.






