కేటీఆర్‌పై మరోసారి సీఈవోకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

by Satheesh |

మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ దీక్ష దివాస్ నిర్వహించడం

కేటీఆర్‌పై మరోసారి సీఈవోకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ దీక్ష దివాస్ నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ నేత నిరంజన్ బుధవారం సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీక్ష దివాస్‌కు సంబంధించి కేటీఆర్ చేసిన ప్రకటన మీడియాలో కూడా వచ్చిందని, దీక్ష దివాస్ పేరుతో బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ రక్తదాన చేసిన విషయాన్ని నిరంజన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కాగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీక్ష దివాస్ పేరుతో కేటీఆర్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story