బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు: డీకే అరుణ

by Ramesh Goud |
DK Aruna
X

దిశ డైనమిక్ బ్యూరో: మహిళల పట్ల పోలీసుల ప్రవర్తనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. నిన్న జరిగిన ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి ఘటనపై డీకే అరుణ స్పందించారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం తీరులాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక మహిళా కార్యకర్తపై పోలీసుల ప్రవర్తన బాదాకరమన్నారు. పోలీసుల వ్యవహార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకొని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed