- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విద్యార్థులను మోసం చేసింది: బండి సంజయ్
తెలంగాణ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మరోసారి మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) విషయంలో మరోసారి మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో.. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా నాటికి ₹600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో కళాశాలలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు కళాశాలలు (Private colleges) అక్టోబర్ 13 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు దీపావళి నాటికి ₹1,200 కోట్లు విడుదల అవుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ, అది కూడా నెరవేరుతుందో లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంవత్సరాలుగా కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు ₹10,000 కోట్లకు పైగా బకాయిలను పోగు చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement)ను రాజకీయ జిమ్మిక్‌గా మార్చేశాయని విద్యా సంస్థలు (Educational institutions) ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు, కళాశాలలు వరుస వాగ్దానాలు, గడువులతో మోసపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్ధానాలకు విరుద్ధంగా తాము మాత్రం విద్యా సంస్థలు, విధ్యార్థుల పక్షాన నిలిచి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాడటానికి మద్దతు ఇస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తన ట్వీట్ లో రాసుకొచ్చారు.






