Harish Rao: అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదేనా ఇందిరమ్మ పాలన?: హరీశ్ రావు

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సెటైర్లు వేశారు.

Harish Rao:  అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదేనా ఇందిరమ్మ పాలన?: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. 'ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి అని ఎద్దేవా చేశారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన కొనసాగుతున్నదని పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయని ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. బుధవారం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన హరీశ్ రావు.. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నారని ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావని విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నవంటూ ఆరోపించారు.

Next Story