- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ ప్రచారాలతో కాంగ్రెస్ అడ్డంగా దొరికింది.. బీజేపీ విమర్శలు
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ సోమవారం ఆసక్తికర ట్వీట్ చేసి.. వెంటనే డిలీట్ చేసింది. ట్వీట్‌లో అబద్ధపు ప్రచారాలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిందని బీజేపీ విమర్శించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని వక్రీకరించి.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, ఓట్లు దండుకోవాలన్న రాక్షస ప్రయత్నం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, సోషల్ మీడియా విభాగం మెడకు ఉచ్చు బిగిస్తుందని పేర్కొంది. కేసుతో సంబంధం ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసి విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ మేరకు గాంధీభవన్‌కు ఇవాళ ఢల్లీ పోలీస్ అధికారులు వచ్చిన వీడియోను బీజేపీ పార్టీ పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను వెంటనే బీజేపీ డిలీట్ చేసింది. ఎందుకు తొలిగించారనే తెలియాల్సి ఉంది.






