- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సి"పల్స్"పై కాంగ్రెస్ రివ్యూ.. ఇద్దరు నేతలతో ఇరకాటం
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల గెలుపు ఊపుతో మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల గెలుపు ఊపుతో మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది. అందులో భాగంగానే పార్టీ ముఖ్యులు, స్ర్కీనింగ్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో 24న రామగుండం, భూపాలపల్లి, 25 లేదా 26న ఇల్లెందు, నకిరేకల్ రివ్యూ చేయనున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిర్వహించే ఈ సమావేశాల్లో పార్టీ పనితీరు, విజయం కోసం తీసుకోవాల్సిన రాజకీయ వ్యూహాలు, బలమైన అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు నేతలు చెబుతున్నారు.
ఏకమై నడిచేలా..!
ఇదిలాఉండగా, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా చేపట్టిన మొదటి సమీక్షలోనే కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. నిజామాబాద్ ఎంపీ పరిధిలో నియోజకవర్గాల సమీక్షలో మాజీమంత్రి టి.జీవన్ రెడ్డి ఆ సమావేశానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాకపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన ఆయన కాంగ్రెస్ సమావేశానికి ఎలా హాజరవుతారని ఫైర్ అయ్యారు. సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లడంతో రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. రాబోయే సమీక్ష సమావేశాలపై పార్టీ అప్రమత్తమై నేతల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా సయోధ్య కుదిర్చేలా ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నేతల మధ్య సమన్వయం ఉంటేనే, అందరం ఐక్యంగా ముందుకెళ్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనాల్లో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
Read More..






