జూబ్లీహిల్స్‌లో నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్.. ఆధారాలతో ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో బీఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్‌లో నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్.. ఆధారాలతో ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో బీఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడారు. మేం ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెండు మీడియా ఛానళ్లతో బీఆర్ఎస్ విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేయిస్తోందని అన్నారు. మీడియా ఛానళ్లు అన్ని పార్టీలను సమానంగా చూడాలి.. ప్రజల తరపున పనిచేయాలని.. కానీ ఆ రెండు ఛానళ్లు మాత్రం కేవలం బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పత్రికల్లో వచ్చే వార్తలను అడ్వటైజ్మెంట్‌గా పరిగణించి బీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగా చూడాలని ఈసీని కోరారు. మీడియా మానిటరింగ్ కమిటీ ఆమోదం లేకుండా ఎలాంటి వీడియోలు ప్రచారం చేయడానికి వీలు లేదని అన్నారు. అన్ని ఆధారాలతో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాం.. తప్పని సరిగా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మేం కూడా కేసీఆర్ చరిత్ర తవ్వాలా?: శ్రీగణేష్ , ఎమ్మెల్యే కంటోన్మెంట్

ఎన్నికలు పారదర్శకంగా జరగాలి.. నిబంధనల ఉల్లంఘన జరగడానికి వీళ్లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. బీఆర్ఎస్ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఫొటో పెట్టి పోలింగ్ స్లిప్పులను పంచి పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌పైన తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదని అన్నారు. ప్రజల ఆశ్వీరాదం కాంగ్రెస్ అభ్యర్థికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా అక్రమాలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ దొంగతనంగా పోల్ చిట్టీలు పంచుతోందని అన్నారు. కేటీఆర్ పొంకనాలు కొడుతున్నాడు.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిపోవాలని కేటీఆర్ చూస్తున్నట్టున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిశాక బీఆర్ఎస్ అనేక పిచ్చి నాటకాలు చేస్తోందని మండిపడ్డారు.

Next Story