- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
by Muthe.Rajitha |
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బుధవారం ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బుధవారం ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు ఇచ్చే సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైతే పది లక్షల గ్రాంట్ అంటూ ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ ఛైర్మన్, పి.రాజేష్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి సంజయ్ ప్రకటనపై ఆధారాలు అందజేశామని, వెంటనే దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి రాజేష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
- Tags
- bandi sanjay
- EC
Next Story






