బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

by Muthe.Rajitha |

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌.

బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌. నిన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీసీ ఎన్నికల కో ఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. గురువారం బోరబండలో నిర్వహించిన రొద షోలో సీఎంను దొంగగా సంభోదించారని ఫిర్యాదులో పేర్కొంది.

కాగా నిన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్.. " కేంగ్రెస్ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారం కూడా లాక్కుపోతారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ కుటుంబాన్ని ఒక్క అవినీతి కేసులో కూడా జైల్లో పెట్టలేదని మండిపడ్డారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాయని హాట్ కామెంట్స్ చేసారు.

Next Story