సర్పంచ్ పోరులో కాంగ్రెస్ ఆధిపత్యం... వెయ్యిమందిపైగా గెలుపు

by Muthe.Rajitha |

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లింది.

సర్పంచ్ పోరులో కాంగ్రెస్ ఆధిపత్యం... వెయ్యిమందిపైగా గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం, ఏకగ్రీవాలు సహా మొత్తం 1,069 మంది కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు. వీరి తర్వాత బీఆర్‌ఎస్‌ 482 స్థానాలు, భాజపా 90 స్థానాలు సాధించగా, ఇతరులు 226 స్థానాల్లో విజయం నమోదు చేశారు. మొత్తం 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు నేడు పోలింగ్ జరగగా, పల్లె పోరు కాంగ్రెస్‌కే అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. కాగా అనేక చోట్ల ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.

Next Story