- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక సీఎం మార్పుపై తేల్చేసిన కాంగ్రెస్.. డీకేకు ప్రియాంక మద్దతు! మీటింగ్‍లో జరిగింది ఇదేనా?
కర్ణాటక సీఎం మార్పుపై జరుగుతున్న హైడ్రామా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజకీయం ఢిల్లీలో వాడీవేడీగా సాగుతోంది. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ ఇందిరా భవన్ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ అయ్యారు. సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీ అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో కలిసి మీడియా ముందుకు వచ్చి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ ఊహాగానాలే అని బయట ప్రచారం జరుగుతున్నట్లు లోపల అలాంటి అంశాలేవి చర్చకు రాలేదని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందన్నారు.
సిద్దరామయ్యకు ఢిల్లీ ఆఫర్:
కేసీ వేణుగోపాల్ ప్రకటన ఇలా ఉంటే లోపల చర్చ మరొకలా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పదవి నుంచి తప్పుకుని రాజ్యసభ ద్వారా ఢిల్లీకి వెళ్లాలని పార్టీ హైకమాండ్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్యకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని హైకమాండ్ సిద్ధరామయ్యను కోరినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఇతర విషయాలు, సమస్యలు తాము చూసుకుంటామి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రాజ్యసభ ఎన్నికల అంశంపైనే చర్చించామనే కేసీ వేణుగోపాల్ ప్రకటన వెనుకు సిద్దరామ్యయను రాజ్యసభకు పంపించే ఆలోచన కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డీకేకు ప్రియాంక మద్దతు!:
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై హైడ్రామా కొనసాగుతున్న వేళ డీకే శివకుమార్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్ మధ్య భవిష్యత్తులో వచ్చే అధికార ఘర్షణలను నివారించాలంటే తక్షణమే సీఎంను మార్చడమే సరైన నిర్ణయమని ఆమె కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేరళ సీఎం ఎంపికలో వి.డి. సతీశన్ పేరు ఖరారు కావడం వెనుక ప్రియాంక గాంధీ బలమైన అండ ఉందనే అభిప్రాయాలు ఉండగా, ఇప్పుడు కర్ణాటకలోనూ ఆమె మాటే చెల్లుబాటు అయితే జాతీయ స్థాయిలో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆమె చరిష్మా, పట్టు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.






