- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొన్నం vs అడ్లూరి.. టీపీసీసీ చీఫ్‌తో దళిత ఎమ్మెల్యేలు భేటీ
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman )పై పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman )పై పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అడ్లూరితో పాటు దళిత నేతలు, ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. నేను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌తో దళిత ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను దళిత ఎమ్మెల్యేలు కలిశారు. కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శామ్యూల్, లక్ష్మీకాంత్, కాలే యాదయ్యలు భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కి జరిగిన అవమానంపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో చర్చించారు. ఇప్పటికే మంత్రి పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరితో మాట్లాడినానని.. సమస్య కూడా సాల్వ్ అయిందని మహేష్ కుమార్ గౌడ్ వారితో చెప్పారు. రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు.






