- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress vs BRS: మేము కాదు మీరే అసలైన విలన్లు.. కేటీఆర్‍కు కాంగ్రెస్ కౌంటర్
తెలంగాణలో 'విలన్' పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్‍గా మారుతోంది. టాపిక్ ఏదైనా విమర్శలతో బీఆర్ఎస్ (BRS) దూకుడుగా వ్యవహరిస్తుంటే ఇక బీఆర్ఎస్ స్పీడుకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో తాజాగా ఇరు పార్టీల మధ్య 'విలన్' రాజకీయం (villain politics) హాట్ టాపిక్‍గా మారింది. తెలంగాణకు శాశ్వత విలన్ కాంగ్రెస్సే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. నిన్న దీక్షా దివస్‍లో భాగంగా మాట్లాడిన కేటీఆర్.. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు ఎన్నో చేసిందని ఆరోపించారు. 2004 లో మా పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఎత్తుకెళ్లిందని తెలంగాణకు నాటి నుంచి నేటి వరకు ఫస్ట్ అండ్ పర్మినెంట్ విలన్ కాంగ్రెస్ పార్టీనే ఆని ఆరోపించారు.
మేము కాదు మీరే అసలు విలన్లు:
బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ (Congress) కౌంటర్ ఇస్తోంది. తెలగాణకు అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావే అని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలే నిర్ణయించారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. బీఆర్ఎస్ పార్టీ చరిత్రగా మిగిలిపోనుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకా కాంగ్రెస్ పార్టీ విలన్? అని కేటీఆర్‍ను ప్రశ్నించారు. పదేళ్లు ప్రజలకు దూరంగా ఉంటూ ఐదేళ్లు కేబినెట్‍లో మహిళలకు స్థానం లేకుండా పరిపాలన సాగించడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటల గారడీ చేసిన మీరే తెలంగాణ రాష్ట్రానికి అసలైన విలన్లు అని దుయ్యబట్టారు. మీ సంగతి గ్రహించే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఏడు చోట్ల కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదన్నారు.






