- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ చీర్ల రజిని రాజీనామా
చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్ నేత చీర్ల చందర్, మూడోవార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆయన చీర్ల రజిని పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.

దిశ, వనపర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ వనపర్తి కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్ నేత చీర్ల చందర్, మూడోవార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆయన చీర్ల రజిని పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. రాజీనామా అనంతరం భార్యభర్తలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని వాపోయారు. పార్టీకి విధేయులుగా ఉన్న మేము ఎమ్మెల్యే గెలుపు కోసం కృషిచేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేశామని, కానీ రాజకీయంగా అనుభవమున్న మమ్మల్ని కాదని, అనుభవం లేని ఇతర వ్యక్తులకు చైర్మన్ పదవి ఇవ్వడాని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదవి ఆశిస్తున్న వ్యక్తులను కనీసం కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ, అలా జరగలేదన్నారు. హైకమాండ్ నుంచి నిర్ణయం సీల్డ్ కవర్లో వస్తుందని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. అంతకుముందే ఎంపీకి మా వనపర్తి మున్సిపల్ చైర్మన్ వీరే అని చెప్పి పరిచయం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నా భార్యకు చైర్మన్ పదవి రానందుకు నేను, మా సతీమణి పార్టీతోపాటు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు. రాజీనామా లేఖను ఆర్డీవోకు అందజేశామని చెప్పారు.






