Jubilee Hills By-Election: హైదరాబాద్ మేయర్‌కు కాంగ్రెస్ కీలక బాధ్యతలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-02 16:33:24  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు కష్టపడుతున్నాయి.

Jubilee Hills By-Election: హైదరాబాద్ మేయర్‌కు కాంగ్రెస్ కీలక బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పలు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదివారం నాడు ఈ మేరకు ఓ జాబితా విడుదల చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక 2025 కోసం ఈ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి (జీహెచ్ఎంసీ మేయర్), కో-చైర్మన్‌గా ఎరవత్రి అనిల్ కుమార్ (మాజీ ఎంఎల్‌ఏ)లు నియమితులు. సభ్యులుగా సి. రోహిణ్ రెడ్డి (ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు), సమీర్ వల్లువుల్లా (హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు), మోతే శ్రీలతా శోభన్ రెడ్డి (జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్), పి. విజయారెడ్డి (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), ఎం. రజితా పరమేశ్వర్ రెడ్డి (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), బొంతు శ్రీదేవి (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), బానోతు సుజాత (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), మహాలక్ష్మి రామన్ గౌడ్ (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), వి. పూజిత (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), ఆర్. మంజుల (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), బూరుగడ్డ పుష్ప (జీహెచ్ఎంసీ కార్పొరేటర్), పి. ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, ఉజ్మా షకీర్‌ ఉన్నారు. ఈ కమిటీ ఉపఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయనుంది.

Next Story