- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ప్రచారంలో దుమారం.. బీజేపీ, ఎంఐఎం, హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ప్రధాన పార్టీల మధ్య పరస్పరం మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ప్రచార పర్వం నున్వా నేనా అన్నట్లుగా సాగుతున్న వేళ బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ ఇవాళ టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పి.రాజేశ్ కుమార్ ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముదినికి లేఖ రాశారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మీటింగ్ కు మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్, 6వ తేదీన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ మీటింగ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ బోధన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారని ఇది ఎస్ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధం అని పేర్కొన్నారు. ఎస్ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం విద్యా సంస్థలు లేదా వాటి ప్రాంగణాలను రాజకీయ ప్రచారాలు, సభల కోసం ఉపయోగించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ప్రజాసభలు నిర్వహించేందుకు లేదా ప్రచారం చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ లేదా ఎన్నికల అధికారులు ఎలా అనుమతులు ఇవ్వడంపై సందేహాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించించి అనుమతులు ఇచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్లు / ఎన్నికల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డబ్బులు తీసుకుని ఓట్లు వేయమన్నారని:
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిరాని రాజేశ్ కుమార్ మరో లేఖను రాశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని బీఆర్ఎస్‍కు ఓటు వేయాలని హరీశ్ రావు ఓటర్లను కోరారని ఆరోపణలు ఉన్నాయని ఇది ఓటర్లను లంచం ఇచ్చి ప్రభావితం చేసే ప్రయత్నంగా, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే చర్యగా స్పష్టం అవుతున్నదన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను బహిరంగంగా దిక్కరించడం మాత్రమే కాకుండా న్యాయమైన ఓటు హక్కును కూడా దెబ్బతీస్తాయన్నారు. అందువల్ల ఎంసీసీని ఉల్లంఘంచిన ఎన్నికల సమగ్రతను ప్రమాదంలోకి నెట్టిన హరీశ్ రావుపై చక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.






