- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసీ రూల్స్‌కు ‘నమస్తే తెలంగాణ బ్రేక్’.. ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ కంప్లైంట్
ఎలక్షన్ కమిషన్ నిబంధనలను నమస్తే తెలంగాణ పేపర్ ఉల్లంఘిస్తున్నదని కాంగ్రెస్ నేతలు నిరంజన్, మల్లు రవిలు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్షన్ కమిషన్ నిబంధనలను నమస్తే తెలంగాణ పేపర్ ఉల్లంఘిస్తున్నదని కాంగ్రెస్ నేతలు నిరంజన్, మల్లు రవిలు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం వచ్చిన ఎడిషన్‌లోని వార్తలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేలా వార్తలు ప్రచురితం చేశారని స్పష్టం చేశారు. ఈసీఐ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ పెయిడ్ న్యూస్‌ను పబ్లిష్చేస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్ధులకు అనుకూలంగా, పార్టీ క్యాంపెయన్‌లు వంటివేవి పబ్లిష్కాకూడదనే నిబంధలను ఉన్నా.. నమస్తే తెలంగాణ పేపర్ ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. వెంటనే కేసులు నమోదు చేయాలని కోరుతూ చీఫ్ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు.
ఏపీ పోలీసుల అత్యుత్సాహం..
తెలంగాణ ఓటర్లను రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లు నిరంజన్, మల్లు రవిలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీ బోర్డర్లలో అడ్డుకోవడం దారుణమన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతని, కానీ ఉద్యోగాలు, చదువు, ఇతర నిమిత్తం ఏపీలో నివాసం ఉంటున్న తెలంగాణ ఓటర్లను ఏపీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని గుర్తు చేశారు. వెంటనే ఏపీ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.






