తేజస్వితో పాటు కిషన్ రెడ్డిపైనా చర్యలు తీసుకోండి: స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఎంపీ వంశీ కృష్ణ గడ్డం పేర్కొన్నారు.

తేజస్వితో పాటు కిషన్ రెడ్డిపైనా చర్యలు తీసుకోండి: స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఎంపీ వంశీ కృష్ణ గడ్డం పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన త్యాగాలు, ప్రజాస్వామ్య పోరాటాన్ని అవమానించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలు సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, లోక్‌సభ నిబంధనల ప్రకారం వాటిని అధికారిక రికార్డుల నుంచి తొలగించాలని అభ్యర్థించారు. రూల్ 380 ప్రకారం ఆ వ్యాఖ్యలను ఎక్స్‌పంజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం నిలబెట్టేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు సభ నియమావళి ఉల్లంఘన కింద వస్తాయా అనే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

Next Story