- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- టీడీపీ పాలనలో 51శాతం ప్రైవేట్ పరం చేస్తే..
- బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా మూతపడింది
- ప్రజా ప్రభుత్వంలో ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తాం..
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
దిశ,జగిత్యాల ప్రతినిధి : షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తో కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా రైతులు చెరుకు సాగు చేస్తున్నారని, వాణిజ్యపరంగా చెరుకు సాగు రైతులకు లాభసాటి గా ఉంటుందని, చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణలో అలసత్వంతో టీడీపీ పాలనలో 51 శాతం ప్రైవేట్ పరం చేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అది పూర్తిగా మూసి వేశారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం చక్కెర కర్మాగారం తెరుచుకుంటుందని భావిస్తే అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు.
గత పాలకులు షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పులు తీసుకొస్తే బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు విడిపించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సూచనల తో వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.176 కోట్లు చెల్లించి, ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీపై ఆధారపడి జగిత్యాల జిల్లాలో దాదాపు 1500 ఎకరాలలో చెరుకు రైతులు సాగుచేస్తున్నారని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్దరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ వేసినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.






