- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి ఎప్పుడు అలాంటి పని చేయడు: మహేష్‌కుమార్ గౌడ్
రైతు బంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ రాకముందు మాత్రమే ఇవ్వమని కోరామన్నారు. కానీ రైతు బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆరెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి రాయకుండానే ఫేక్ లెటర్ సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ రైతులకి వ్యతిరేకంగా లెటర్ రాయడన్నారు. రైతు బంధుకి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. ఫోర్జరీ లేఖ మీద తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. క్రైమ్ డీసీపీని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. పీసీసీ స్పోక్స్ పర్సన్ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.. రైతు బంధుని పోలింగ్‌కు ముడిపెట్టి బీఆర్ఎస్ గేమ్ ఆడుతుందన్నారు. రైతు బంధు ఆగడానికి కాంగ్రెస్‌తో సంబంధం లేదని నొక్కి చెప్పారు.






