- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుమ్ములేపిన కాంగ్రెస్ అభ్యర్థులు.. మెజారిటీ స్థానాల్లో విజయకేతనం
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఒంటి గంట లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టగా.. సాయంత్రం 6 గంటల్లోపు మెజారిటీ స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి తుది ఫలితాలు వెల్లడించేందుకు ఆలస్యమైంది.
అధికార పార్టీ అభ్యర్థుల హవా..
అయితే, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2,872 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పిన బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నేతలకు షాక్ తిగిలింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 195 స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులు 460 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అందుకు ముందే డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3,834 సర్పంచ్, 27,600కు పైగా వార్డులకు ఎన్నికలు నిన్నటితో ముగిశాయి.






