- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రచార హోరు.. కార్యకర్త నుంచి మంత్రుల వరకు అక్కడే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తమ బలగాన్ని ఇక్కడే మోహరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తమ బలగాన్ని ఇక్కడే మోహరించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా లీడర్లు, కేడర్ నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు. సీఎం నుంచి ముఖ్య కార్యకర్త వరకు ఈ ఎన్నికను సవాల్ గా తీసుకుని పనిచేస్తున్నారు. ప్రచారం ముగియడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో పతాక స్థాయికి చేర్చారు. సెగ్మెంట్ లోని ఏడు డివిజన్లకు ఇన్ చార్జి మంత్రులను అధిష్టానం నియమించింది. వారితో పాటు డివిజన్ల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనే మకాం వేసి ఓటర్లను కలుసుకుంటున్నారు. బస్తీల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే చాలా కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో మంత్రులు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసేలా వారితో హామీలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మంత్రులే అన్నీ తామై..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కమిటీలు, ఇన్ చార్జీలను నియమించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముగ్గురు మంత్రులు ఇన్ చార్జీలుగా నియమితులయ్యారు. డివిజన్ కు ఇద్దరు మంత్రులకు చొప్పున బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు 40 మంది ముఖ్యనేతలను స్టార్‌క్యాంపెయినర్లుగా నియమించారు. మహిళల ఓట్ల కోసం 9గ్రూపులతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ప్రతి గ్రూపులో 9 మంది సభ్యులను నియమించారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు 16 మందితో కోఆర్డినేషన్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు 13 మందితో ఎలక్షన్‌కమిషన్ కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. రాష్ట్రంలోని ముఖ్యనేతలు దాదాపు ఏదో ఒక కమిటీలో ఉండేలా కూర్పు చేశారు. కమిటీలు ఏయే పనులు చేయాలనే కార్యాచరణను సైతం వారికి అప్పగించారు. వారంతా ప్రస్తుతం యాక్టీవ్ గా ఎన్నికల్లో పనిచేస్తున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.






