Phone Tapping Case: బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు.. హరీశ్ రావు విచారణపై టీ బీజేపీ రియాక్షన్

by Prasad Jukanti |   (  Updated:2026-01-20 06:19:24  IST  )

Phone Tapping Case: బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు.. హరీశ్ రావు విచారణపై టీ బీజేపీ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సిట్ విచారణపై తెలంగాణ బీజేపీ (Telangana BJP) స్పందించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు (Ramachander Rao) విమర్శించారు. ఉత్తుత్తి విచారణతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. మంగళవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సానుభూతి ప్రదర్శిస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడులో బీజేపీ ఓడిపోయిందన్నారు.

నిన్ను వదిలేది లేదు:

కాగా, సిట్ నోటీసుల నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు వీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదన్నారు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నానని ధైర్యంగా వెళ్తున్నాం అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెబుతానన్నారు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టం. నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటామన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటామన్నారు.
Next Story