Dharmapuri Arvind: కాంగ్రెస్ ఓ బ్రోకర్ పార్టీ.. ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఎంపీ అర్వింద్

by Prasad Jukanti |   (  Updated:2026-02-14 07:08:08  IST  )

నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. సీఎంరేవంత్ రెడ్డి బలమైన స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బ్రోకర్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Dharmapuri Arvind: కాంగ్రెస్ ఓ బ్రోకర్ పార్టీ.. ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఎంపీ అర్వింద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడింది. ఇక్కడ 28 డివిజన్లలో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ తాము ప్రతిపక్షంలో ఉంటామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ వార్డు సభ్యులు, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే బీఆర్ఎస్‍కు పట్టిన గతే కాంగ్రెస్‍కు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రభుత్వమేమి కాదని, సీఎం రేవంత్ రెడ్డి బలమైన పొజిషన్‍లో లేరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఛీ కొడుతున్నారని, దానికి తోడు ఇలా కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే రాబోయే కాలంలో మరింత ఛీ కొడుతారన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‍లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను డామినేట్ చేశామన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధించామన్నారు. బీజేపీని ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

పోలీసులపై నేనే కేసు పెట్టాలి:

ప్రభుత్వం పోలీస్ శాఖను ఉపయోగించుకుంటోందని పోలీసులు నాపై కేసులు పెట్టడం ఏంటి? నేనే పోలీసులపై కేసు పెట్టాలన్నారు. మా అభ్యర్థులను పోలింగ్ బూత్ లనుండి బయటకు పంపించారని, పోలీసులే కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడానికి కాంగ్రెస్ వారికి సహయం చేస్తున్నారని పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేస్తారా లేక బ్రేక్ చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టుపట్టించారనే కేసీఆర్‍ను ప్రజలు ఓడించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వారి వారి పార్టీలు నిర్ణయించుకుంటాయన్నారు.

కాంగ్రెస్ ఓ బ్రోకర్ పార్టీ

బండి సంజయ్ వారియర్ అని ఆయన అర్జునుడి రోల్ కు ఫిట్ అవుతారని స్టీరింగ్ నా చేతిలో ఉన్నంత వరకు ఓకే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు. బీజేపీ, ఎంఐఎంకు సమ దూరం పాటిస్తామన్న టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ పూర్తిగా ఆత్మాభిమానం కొల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్మూర్ లో సీట్లు తక్కువ రావడంతో అక్కడి క్యాడర్ కు ఆయన క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే ఉండటం వల్ల అక్కడ తాను దృష్టి పెట్టలేకపోయాన్నారు. కాంగ్రెస్ లౌకిక పార్టీ కాదని ఇది ఓ బ్రోకర్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story