Kavitha : ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్, బీజేపీ నాటకాలు : కవిత

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 05:32:02  IST  )

బీసీ కులగణన (BC Census)నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందు(Divert Public Attention)కు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు(Congress, BJP Dramas) ఆడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavith)ఆరోపించారు.

Kavitha : ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్, బీజేపీ నాటకాలు : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ కులగణన (BC Census)నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందు(Divert Public Attention)కు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు(Congress, BJP Dramas) ఆడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavith)ఆరోపించారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికే ప్రధాని మోదీ బీసీనా.. కాదా..? అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని కవిత మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. మోదీ బీసీ అయితే మాకేంది.. ఓసీ అయితే మాకేంది..? అని ఆమె ప్రశ్నించారు. బీసీల జనాభాను కరెక్టుగా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని, దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్దంగా చెల్లుబాటు అయ్యేలా..న్యాయ వివాదాలకు తావులేకుండా కోర్టుల్లో నిలబడేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు.

ఒక బిల్లు కాదు..మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని..విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలని, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని, 42 శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు.

Next Story