- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసంతృప్తులకు కాంగ్రెస్ బుజ్జగింపులు.. కీలక పదవులిస్తామని హామీ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున అనేక మంది నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున అనేక మంది నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు. చివరికి నవీన్యాదవ్కే టికెట్ దక్కింది. దీంతో కొందరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కష్ట కాలంలో పార్టీని నమ్ముకొని ఉంటే అధిష్టానం తనను పక్కన పెట్టిందని మాజీ ఎంపీ అంజన్ కుమార్యాదవ్మీడియా ముఖంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్వెళ్లి బుజ్జగించారు. రాబోయే రోజుల్లో పార్టీ, పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చినట్టు తెలిసింది. సీఎన్‌రెడ్డి సైతం అలగడంతో మంత్రులు పొన్నం, వివేక్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్లుమాట్లాడి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్సైతం టికెట్ రేసులో ఉండి చివరికి తాను పోటీలో లేనని ప్రకటించారు. టికెట్ఎవరికి ఇచ్చినా విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. నవీన్యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా బొంతు రామ్మోహన్ బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఆ పుకార్లను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.
READ MORE ......
మరోసారి రచ్చకెక్కిన మంత్రుల విభేదాలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి






