- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ MP అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
పార్లమెంట్ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఇద్దరికి అవకాశం కల్పించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. సోమవారం రాత్రి అధికారికంగా విడుదల చేశారు. ఈ జాబితాలో ఇద్దరికి అవకాశం కల్పించారు. మహారాష్ట్రలోని అకోల నియోజకవర్గ అభ్యర్థిగా అభయ్ కాశీనాథ్ పాటిల్, తెలంగాణలోని వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేశారు. అయితే, పార్టీలో చేరిన మరుసటి రోజునే కావ్యకు టికెట్ ఖరారు కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అయితే, పార్టీ అధిష్టానం జాబితా విడుదల చేయడానికి ముందే వరంగల్ అభ్యర్థి పేరును స్థానిక మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కడియం కావ్యను అభ్యర్థిగా కాసేపట్లో అధిష్టానం ప్రకటిస్తుందని సురేఖ చెప్పారు. మంత్రి అనౌన్స్ చేసిన విధంగానే కడియం కావ్యను పేరును అధిష్టానం ప్రకటించడం గమనార్హం.
Next Story






