తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : 14 వార్డులు ఏకగ్రీవం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-04 08:06:00  IST  )

వారంరోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకూ 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : 14 వార్డులు ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకూ 9 మున్సిపాలిటీల్లో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 12 వార్డులు కాంగ్రెస్ కైవసమవ్వగా.. రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అత్యధికంగా సూర్యాపేటలో నాలుగు వార్డులు ఏకగ్రీవమవ్వగా.. హుజూర్ నగర్లో ఒకటి, కోదాడలో మూడు వార్డులు, వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలొచ్చాయి. మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్ లో ఏకగ్రీవ ఎన్నిక జరగ్గా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవమయ్యాయి. 14లో 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో.. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపిస్తోంది. 100 స్థానాల్లో గెలవడమే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. ఆ విజయాన్ని అలవోకగా చేధిస్తుందన్న సంకేతాలొస్తున్నాయి.

మున్సిపాలిటీల వారిగా వివరాలిలా..

ఆలంపూర్ మున్సిపాలిటీ - వార్డు 10 (ఎస్టీ జనరల్) పి. విక్రమ్ (BRS) ఏకగ్రీవం

చౌటుప్పల్ మున్సిపాలిటీ - వార్డు17 (ఎస్సీ మహిళ) చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవం

ఎదులాపురం మున్సిపాలిటీ - వార్డు 15 (యూఆర్ మహిళ) తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) ఏకగ్రీవం

హాలియా మున్సిపాలిటీ - వార్డు 10 (బీసీ మహిళ) చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవం

కోదాడ మున్సిపాలిటీ - వార్డు 11 (యూఆర్ మహిళ) దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవం

కోదాడ మున్సిపాలిటీ - వార్డు 21 (బీసీ మహిళ) కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) ఏకగ్రీవం

కోదాడ మున్సిపాలిటీ - వార్డు 31 (యూఆర్ మహిళ) యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవం

హుజూర్ నగర్ మున్సిపాలిటీ - వార్డు 10 (బీసీ మహిళ) సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవం

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు - 58 (యూఆర్ మహిళ) బి. రమాదేవి ఏకగ్రీవం

మెదక్ మున్సిపాలిటీ - వార్డు 32 (యూఆర్ మహిళ) గోదల మానస ఏకగ్రీవం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-1 (యూఆర్ మహిళ) మడిపెల్లి విజయ (కాంగ్రెస్) ఏకగ్రీవం

వికారాబాద్ మున్సిపాలిటీ - వార్డు 1 (యూఆర్ జనరల్) అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవం

వికారాబాద్ మున్సిపాలిటీ - వార్డు 15 (ఎస్సీ జనరల్) పి. విజయలక్ష్మి (బీఆర్ఎస్)ఏకగ్రీవం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ - వార్డు 10 (బీసీ మహిళ) గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవం

Next Story