కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయ్... ఎంపీ రఘునందన్ ఫైర్

by Kema Shiva Kumar |

బనకచర్ల (Banakacharla)పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయ్... ఎంపీ రఘునందన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల (Banakacharla)పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ (BRS) ప్రజెంటేషన్లతో కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో పదేళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని.. నేడు కమిషన్ల పేరుతో కాంగ్రెస్ (Congress) కాలం వెళ్లదీస్తూ వస్తుందని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం జరగనివ్వబోదని అన్నారు. అందుకు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి పంపిందని కామెంట్ చేశారు. కేసీఆర్ఎస్ తెలంగాణకు 299 టీఎంసీల నీరు ఒప్పుకుని వచ్చి తప్పు చేశారని ఆరోపించారు. తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎంపీ రఘునందర్ రావు అన్నారు.

Next Story