- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీల అక్రమ పొత్తు.. మాజీ మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీల దోస్తీపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కోసం కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇవాళ కాంగ్రెస్, బీజేపీకు పార్టీలకు ఎలాంటి సిద్ధంతాలు లేవని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాయని కామెంట్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ పదవులను గడ్డిపోచలా వదిలేశారని అన్నారు. చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, శాపనార్థాలు ఎవరూ తినలేదని.. భవిష్యత్తులో కూడా తినకపోవచ్చునేమోనని పేర్కొన్నారు. కేసీఆర్‌పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మొండి ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అశేష తెలంగాణ ప్రజలకు చూపారని హరీశ్ రావు తెలిపారు.






