- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ఆందోళన.. అదానీ మెగా కుంభకోణం దర్యాప్తుకు డిమాండ్
అదానీ మెగా కుంభకోణం పై దర్యాప్తు జరపాలని కోరుతూ.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: అదానీ మెగా కుంభకోణం పై దర్యాప్తు జరపాలని కోరుతూ.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణ కొరకు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈడీ కార్యాలయం వరకు వెళ్లనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపదాస్ మున్షీ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ ఆందోళనలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేక్ వెంకట స్వామి, జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






