బై‌పో‌ల్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-22 02:22:01  IST  )

రేపటి కేబినెట్ సమావేశం తరువాత మంత్రివర్గం పూర్తిస్థాయిలో జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది.

బై‌పో‌ల్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి కేబినెట్ సమావేశం తరువాత మంత్రివర్గం పూర్తిస్థాయిలో జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో మంత్రిని ఇన్‌చార్జిగా, వారికి సపోర్టుగా ఎమ్మెల్యేలు, లీడర్లతో టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం పూర్తయ్యేవరకు ఈ టీమ్ అక్కడ రాత్రింబవళ్లు పనిచేసేందుకు షెడ్యూలు తయారు చేస్తున్నట్లు టాక్.

ఇంటింటికీ ప్రచారం

ఇప్పటికే నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ ఎన్నికల బాధ్యతల్లో ఉన్నారు. కానీ వారితో ఆశించిన స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయడం లేదని, కేవలం పైపై మాత్రం ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ప్లాన్ ను మార్చినట్లు తెలిసింది. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత మంత్రులు మొత్తం ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేవిధంగా షెడ్యూలు తయారు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో నియోజకవర్గంలో ఆరు డివిజన్లకు, ఇన్ చార్జులుగా మంత్రులను నియమించే యోచన లో ఉన్నారు. మంత్రికి సఫోర్టుగా ఎమ్మెల్యేలు, లీడర్లతో ఒక టీమ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ టీమ్ తమకు అప్పగించిన డివిజన్ లో ఉదయం నుంచి రాత్రి ప్రచారం ముగిసే వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేవిధంగా షెడ్యూలు తయారు చేస్తున్నారు.

సీఎం రేవంత్ రోడ్ షోలు

ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో సీఎం రే వంత్ రెడ్డి రోడ్డు షోలు నిర్వహించనున్నారు. ఒ క్కో రోజు రెండు, మూడు రోడ్డు షోలు చేసేందు కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఆరు డివిజన్లు, బ స్తీలను కవర్ చేసేవిధంగా సీఎం ఎన్నికల ప్ర చారం ఉంటుందని పార్టీ వర్గాలు వివరించా యి. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రోడ్డు షోలు చే సేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇన్ చా ర్జిగా బాధ్యతలు అప్పగించని మంత్రులు సైతం ఎన్నికల ప్రచారంలో భాగంకానున్నారు.

Next Story