- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: కాంగ్రెస్ మిషన్ గుజరాత్.. తెలుగు రాష్ట్రాల నేతలకు కీలక బాధ్యతలు
మిషన్ గుజరాత్ లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తమకు చాలెంజ్ గా మారిన గుజరాత్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. తాజాగా మిషన్ గుజరాత్ కింద (Mission Gujarat) ఏఐసీసీ పరిశీలకులను (AICC Observers) ఆ పార్టీ అధిష్టానం నియమించింది. 43 మంది అబ్జర్వర్లను, ఏడుగురు సపోర్టింగ్ అబ్జర్వర్లను నియమించిది. వీరికి జిల్లా అధ్యక్షులను నియమించే బాధ్యతలను అప్పగించింది. ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఒక ఏఐసీసీ పరిశీలకుడితో పాటు నలుగురు పీసీసీ పరిశీలకుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సీ వేణుగోపాల్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ ప్రకటించిన అబ్జర్వర్లలో తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshinatarajan), ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డి (Vamsichander Reddy), ఏపీ మాజీ పీసీసీ చీప్ గిడుగు రుద్రరాజు, తెలంగాణ ఏఐసీసీ మాజీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కు చోటు దక్కింది.






