- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రంజాన్ తోఫా పంపిణీలో గందరగోళం..
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ఐదు వేలకు పైగా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ఐదు వేలకు పైగా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 750 తోఫా గిఫ్టులు మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసింది. గిఫ్టులను 9 మండలాలకు విభజిస్తే కేవలం 80 చొప్పున మాత్రమే దక్కుతాయి.అయితే ప్రతి మండలంలో 600కు పైగానే పేద ముస్లిం కుటుంబాలు ఉన్నట్లు మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు. తీసుకెళ్లిన 80 రంజాన్ తోఫాలు ఎలా పంపిణీ చేయాలి...? అనేది మత పెద్దల్లో ప్రశ్నార్థకమైంది. అరకొర పంపిణీ చేస్తే ముస్లింల మధ్యనే గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటూ చివరికి ముస్లిం మత పెద్దలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం ద్వారా అర్హులైన ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫాలు వచ్చే విధంగా కృషి చేయాలని పేద ముస్లిం కుటుంబాలు కోరుతున్నాయి.
దిశ, తుంగతుర్తి: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు విడుదల చేసిన తోఫా గిఫ్ట్ ల పథకం పంపిణీ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి అగమ్య గోచరంగా తయారైంది.ముస్లిం సోదరుల సంఖ్యకు తగ్గట్టు రాకపోవడంతో వీటి పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చిన తోఫా గిఫ్టులు మండలాలపరంగా ఎలా విభజించాలి...? అనేది ఒక ప్రశ్నగా మారితే తీసుకపోయిన వాటిని మండలాల్లో ఎవరెవరికి పంచాలి అనేది రెండో ప్రశ్న.ఒకవేళ ఎలాగో...అలాగా పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని చూస్తే గొడవలు జరిగే ఆస్కారం ఉందంటూ మత పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా అందరిలో చులకనయ్యే పరిస్థితి ఉంటుందంటూ జంకుతున్నారు. మొత్తానికి తోఫా గిఫ్టుల పంపిణీ ముస్లిం మత పెద్దలకు తలనొప్పిగా మారింది.
మండలాలకు చేరని గిఫ్టులు..
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో మోత్కూర్,అడ్డ గూడూరు,శాలిగౌరారం,తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో ఉండగా ఇందులో ఐదు వేలకు పైగా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.అయితే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 750 తోఫా గిఫ్టులు మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేయగా అవన్నీ స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరాయి.అనంతరం కేటాయింపులు జరిగిన విధంగా ఇక్కడి నుండి ఆయా మండలాలకు గిఫ్టులు వెళ్లాల్సి ఉంది. ఇలా వచ్చిన గిఫ్టులను 9 మండలాలకు విభజిస్తే కేవలం 80 చొప్పున మాత్రమే దక్కుతాయి.అయితే ప్రతి మండలంలో 600కు పైగానే పేద ముస్లిం కుటుంబాలు ఉన్నట్లు మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు.ఉదాహరణకు.. తుంగతుర్తి మండలం కాశితండ గ్రామంలో 100 పైచిలుకు పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.అంతేకాకుండా మరికొన్ని గ్రామాల్లో 50 నుంచి 100,ఇంకా కొన్ని గ్రామాల్లో 50 లోపు పేద కుటుంబాల సంఖ్య ఉన్నట్లు మత పెద్దలు వివరిస్తున్నారు.అంటే దాదాపు 600 పై చిలుకుగా వారి సంఖ్య ఉంటున్నట్లు ఉదహరిస్తున్నారు.
కొలిక్కి రాని పరిస్థితులు..
ఈ సందర్భంగా తీసుకెళ్లిన 80 రంజాన్ తోఫాలు ఎలా పంపిణీ చేయాలి...? అనేది మత పెద్దల్లో ప్రశ్నార్థకమైంది.ఇది ఇలా ఉంటే మా మండలంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పేద ముస్లింలకు తగ్గట్టుగా రంజాన్ తోఫాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సంబంధిత తహశీల్దారులకు ముస్లిం పెద్దలు స్పష్టం చేశారు. ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో మీరే వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ తోఫా గిఫ్టులు పంపిణీ చేయండి.... అంటూ తెగేసి చెప్తున్నారు. అయితే దీనికి తగ్గట్టుగానే ఆయా మండలాల తహశీల్దార్లు కూడా సమాధానాలు చెప్పేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన 750 రంజాన్ తోఫాలలో లెక్క ప్రకారం తొమ్మిది మండలాలకు విభజించి 80 చొప్పున ప్రతి మండలానికి కేటాయిస్తున్నట్లు అధికారులు ముస్లిం పెద్దలకు చెబుతున్నప్పటికీ పరిస్థితులు ఓ కొలిక్కి రాలేదు. అరకొర తరహాలో జరిగే రంజాన్ తోఫా గిఫ్ట్ ల పంపిణీ విషయంలో ముస్లింల మధ్యనే గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటూ చివరికి ముస్లిం మత పెద్దలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం ద్వారా అర్హులైన ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫాలు వచ్చే విధంగా కృషి చేయాలని పేద ముస్లిం కుటుంబాలు కోరుతున్నాయి.






