తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్ పోడియంను ముట్టడించిన బీఆర్ఎస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 15:43:54  IST  )

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) స్పీకర్ పోడియంను ముట్టడించారు.

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్ పోడియంను ముట్టడించిన బీఆర్ఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) స్పీకర్ పోడియంను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రసంగించారు. చట్టానికి, న్యాయానికి బీఆర్ఎస్ నేతలు అతీతులా అని భట్టి మండిపడ్డారు. జరిగిన దోపిడీ గురించి మాట్లాడకుండా వేరే విషయాలు సభలో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్‌ను పొలిటికల్ సర్కస్ అనడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల్లా లేనిది ఉన్నట్టు తప్పుడు ప్రచారం తాము చేయడం లేదని అన్నారు. వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చేందుకే ఘోష్ కమిటీ వేశామని అన్నారు. తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదని చెప్పారు. చట్ట ప్రకారమే ఏ చర్యలైనా తీసుకుంటామని అన్నారు. ఇలా ఎంతకాలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని సీరియస్ అయ్యారు. తెలంగాణ సమాజానికి వాస్తవం చెప్పాల్సిన బాధ్యత తమ మీద ఉన్నదని అన్నారు.

Next Story