Kishan Reddy : అవినీతి ఆస్తి పంపకం కోసమే గొడవలు : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

గులాబీ పార్టీ(BRS Party)లో ముసలంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy : అవినీతి ఆస్తి పంపకం కోసమే గొడవలు : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీ(BRS Party)లో ముసలంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2014-2023 మధ్య కేసీఆర్(KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleswaram Project Scam)లో రూ. లక్ష కోట్ల అవినీతి చేశారని పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్మును పంచుకోవడంలోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్(KTR), కవిత(Kavitha), హరీష్ రావు మధ్య గొడవలు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది పార్టీలోని అంతర్గత సంక్షోభానికి నిదర్శనమని ఆరోపించారు. కవిత రాసిన లేఖతో బీఆర్ఎస్‌లో సంక్షోభంపై వస్తున్న వార్తలపై ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడు అని తెలిపిన కిషన్ రెడ్డి.. ఆయన వల్లే దేశంలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.

Next Story