బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్స్ కలకలం (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-01-27 14:45:40  IST  )

గణతంత్ర దినోత్సవం మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుందనగా ఓ బాలికల పాఠశాలలో వాడేసిన కండోమ్స్, మద్యం సీసాలు కలకలం సృష్టించాయి.

బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్స్ కలకలం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర దినోత్సవం మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుందనగా ఓ బాలికల పాఠశాలలో వాడేసిన కండోమ్స్, మద్యం సీసాలు కలకలం సృష్టించాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ ఎయిడెడ్ పాఠశాలలో ఈ అసాంఘిక వస్తువులు బయటపడ్డాయి. రేపు నిర్వహించే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థినీలు స్కూల్ పరిసరాలను శుభ్రపరుస్తుండగా కండోమ్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు వెలుగు చూడటంతో జిల్లాలో హాట్ టాపిక్‌గ మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు ముస్తాబు అవుతున్నాయి. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషన్ (CSI) ఎయిడెడ్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేత స్కూల్‌ను శుభ్రం చేయించారు. హెడ్మాస్టర్ వినోద్ ఆదేశం మేరకు బాలికలు పుస్తకాలు వదిలి చీపుర్లు పట్టుకోని పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రం చేశారు. ఈ క్రమంలో స్కూల్ పరిసరాల్లో కండోమ్ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిల్స్ దొరికాయి. దీంతో స్కూల్ విద్యార్థినీలు షాకయ్యారు. విషయాన్ని టీచర్ల దృష్టికి తెచ్చారు. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు వెళ్లి ఆరా తీశారు. స్కూల్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీనిపై స్కూల్ హెచ్ఎం, సీఎస్ఐ చర్చ్ సెక్రటరీని ప్రశ్నించగా సమాజంలో ఇదంతా సహజమేనని లైట్‌గా తీసుకున్నారు. అందుకు తామేమి చేయగలం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.


Click Here For Tweet..

Next Story