- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాగంటి, మాగంలకు సంతాపం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ఆదివారానికి వాయిదా పడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. ముందుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అనుమతితో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారని తెలిపారు. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారని గుర్తు చేశారు. 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు. 1987 నుంచి 88 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారని తెలిపారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన మాగంటి సినీ రంగంలోనూ నిర్మాతగా రాణించారని పేర్కొన్నారు. ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) మొత్తం నాలుగు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారని తెలిపారు.
రాజకీయంగా పార్టీలు వేరైనా.. మాగంటి గోపినాథ్ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని కొనియాడారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత దక్కిన వారిలో ఆయన ఒకరని అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం వారి కుటుంబానికి తీరని లోటని.. చూడటానికి ఆయన క్లాస్‌గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయనో మాస్ లీడర్ అని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. ఇక శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పించారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఉభయ సభలకు రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.






