Niranjan Reddy : కోతల కుట్రతోనే రైతు భరోసాపై షరతులు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-11 09:29:23  IST  )

రైతు భరోసా(Raitu bharosa) సహాయంలో కోతలు(Cuts) పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం పంట సాగు భూములకే సహాయం అంటూ షరతులు పెడుతుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Ex Minister Niranjan Reddy) అన్నారు.

Niranjan Reddy : కోతల కుట్రతోనే రైతు భరోసాపై షరతులు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రైతు భరోసా(Raitu bharosa) సహాయంలో కోతలు(Cuts) పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం పంట సాగు భూములకే సహాయం అంటూ షరతులు పెడుతుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Ex Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ రైతులు పండుగ సంతోషంగా చేసుకోలేని దుస్థితి ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, ఎన్నికల్లో రైతు భరోసాను ఎకరాకు రూ.15వేల నుంచి 12వేలకు తగ్గించిందన్నారు. రుణమాఫీలో కోతలు పెట్టినట్లుగానే రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు పంట సాగు చేస్తేనే రైతు భరోసా ఇస్తామని అంటున్నారని విమర్శించారు.

మొన్నటి దాకా గుట్టలు, రాళ్లు, డిజిటల్ సర్వే, ఐటీ అంటూ చెప్పి ఇప్పుడు అందరికీ ఇస్తామని చెబుతూ కలెక్టర్ల సమావేశం పెట్టి భారం వారి మీద సీఎం భారం పెట్టారని విమర్శించారు. అసలు యాసంగిలో రైతులకు నీళ్లు ఇస్తేనే కదా పంట వేస్తారని, కృష్ణా బేసిన్‌లో యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసిందని, సాగునీరు లేకపోతే రైతులు పంటలు వేయరని..సాగు చేయకపోతే రైతు భరోసా, పంట బోనస్ ప్రభుత్వం ఇవ్వదని గుర్తు చేశారు. వర్షాకాలంలో పంట పండితే మా ఘనత అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కోటి 57 లక్షల టన్నుల వరి పంట పండిందని, 16 లక్షల టన్నుల వడ్లు మాత్రమే సేకరించామని ప్రభుత్వం చెప్పిందని, సేకరించిన వడ్లకు పూర్తిగా బోనస్ ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వంపై నెపం నెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ కంటే గొప్పగా చేస్తామని చెప్పి..ఇప్పుడేందుకు రైతులకు సహాయం ఇవ్వడానికి లెక్కలు వేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు ఇప్పటి నుండి మీ లెక్క కట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు ఎప్పుడు వుంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, గత యాసంగిలో రైతుల పంటలు ఎండిపోయాయని, సాగు చేయని భూములకు రైతు భరోసా ఎగ్గొడితే అంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. వర్షాలు పడ్డా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. కేసీఆర్ పాలనలో 11 విడతల్లో 73 వేల కోట్లు రైతులకు అందించామని, రైతుబంధు 25 వేల కోట్లు వృథా అని ఆరోపించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారన్నారు. మరి ఏడాదిలో ఆ ఉపసంఘం ఏం తేల్చిందని నిలదీశారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు దుర్వినియోగం అయిందని నిరూపిస్తారా అని, వ్యవసాయ శాఖా మంత్రి, డిప్యూటీ సీఎం గ్రామంలో రైతుబంధు దుర్వినియోగం అయిందని నిరూపిస్తారా అని నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు.

రైతుబంధు దుర్వినియోగం అయిందని ఎక్కడా ఆధారాలు లేవని, రైతులను దొంగలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రీకరిస్తుందా అని, రైతుబంధు అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు భరోసా కింద రూ. 5 వేలు ఎక్కువ ఇస్తామని మాట్లాడింది మీరు కాదా అని, రుణమాఫీ కింద రూ. 3,500 కోట్లు ఇంకా రైతులకు చేరలేదన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించుకుంటున్నాయని, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిని ఒకరు రక్షించుకుంటున్నారని, ఏసీబీ కేసు రిజిస్టర్ చేస్తే ఈడీ ఎందుకు దర్యాప్తు చేస్తోందని ప్రశ్నించారు.

మేము అధికారంలో ఉన్న పదేళ్లల్లో కృష్ణా నీళ్లను కేంద్రం పంచలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, ఇప్పుడు ఎవరు ఎవరికి బీ-టీమ్ అనేది బయటపడిందన్నారు. కేసీఆర్‌ను బలహీనపర్చడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి మోడీని ఎదుర్కొంటాం అని రేవంత్ రెడ్డి అంటే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం బీఆర్ఎస్ సంబధాలపై అదే పనిగా మాట్లాడిన బీజేపీ నేతలు.. కాంగ్రెస్ ఎంఐఎం బంధంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Next Story