ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఆ పరీక్ష తప్పనిసరి.. పాస్ అవకపోతే ఇంటికే

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఆ పరీక్ష తప్పనిసరి.. పాస్ అవకపోతే ఇంటికే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లోని కొన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి చేసింది. వారందరూ కంప్యూటర్ పరీక్షకు హాజరవడమే కాదు.. అందులో ఖచ్చితంగా ఉతీర్ణత కావాల్సిందే. ఉతీర్ణత కాని వాళ్లందరినీ ఇంటికి పంపనుంది సర్కార్. కంప్యూటర్ పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఆఫీసు ఆటో మెషిన్ ప్రావీణ్యం కూడా తప్పనిసరి చేసింది. కాగా ఇందుకు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని G.O.237 జారీ చేసింది. అయితే ఈ నిబంధన ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, U.D. టైపిస్టులు, టైపిస్టులు, L.D. టైపిస్టులు మొదలైన కేటగిరీల వారికి వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.

అయితే కొందరు కారుణ్య నియామకాల వంటి వివిధ కారణాలతో ఈ ఉద్యోగాలకు ఎన్నికైన వారుండగా.. ఇకపై వారంతా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ నియమం తీసుకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

Next Story