Cast Census Re Survey : తెలంగాణలో ముగిసిన కులగణన రీసర్వే

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే(Cast Census Survey)లో 3 కోట్ల 4 లక్షల మందికి పైగా వివరాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Cast Census Re Survey : తెలంగాణలో ముగిసిన కులగణన రీసర్వే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే(Cast Census Survey)లో 3 కోట్ల 4 లక్షల మందికి పైగా వివరాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కులగణన పూర్తి స్థాయిలో చేయలేదనే విమర్శలు రావడంతో మరో 12 రోజులపాటు కులగణన రీసర్వే(Cast Census Re Survey) చేయాలని నిర్ణయించింది సర్కార్. ఈ నెల 16వ తేదీ నుంచి నేటి వరకు 12 రోజుల పాటు రీ సర్వే కొనసాగింది. రెండో దఫా మొత్తం మూడు పద్ధతుల్లో వివరాలను ప్రభుత్వం సేకరించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ వివరాలు పొందుపర్చుచుకోవడం, ప్రజాపాలనా సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు ఇవ్వడం, ఆన్ లైన్ లో ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని కుటుంబ వివరాలు నమోదు చేసి ఆ వివరాలు ప్రజాపాలనా సేవా కేంద్రంలో సమర్పించడం ఈ మూడు పద్దతుల్లో ఈసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

2024 నవంబర్ 6న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు సాగిన తొలి దఫా సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కటుంబాల(96.9 శాతం)ను సర్వే చేశామని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ఇంకా 3.1 శాతం (3,56,323) కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు. మిగిలిపోయిన వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అయితే మరోసారి అవకాశం కల్పించినా ఈ కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనకపోవడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. కాగా కేసీఆర్ ఫ్యామిలీలో కల్వకుంట్ల కవిత ఒక్కరే తొలివిడత సర్వేలోనే తమ వివరాలను నమోదు చేసుకోగా రీ సర్వే నిర్వహిస్తే తాను కేసీఆర్ పాల్గొంటామని చెప్పిన కేటీఆర్.. రీ సర్వేలో మాత్రం పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.

Next Story