జూబ్లీహిల్స్ బైపోల్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికుడు కాని, ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డికి జూబ్లిహిల్స్ లో ఓటు హక్కు లేదని అయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఇక్కడే తిరుగుతున్నారని ఆరోపించారు.

హబీబ్ ఫాతిమానగర్‌లోని పోలింగ్ బూత్ నం. 110 నుండి 120 వరకు ఆయన ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలంటూ స్థానిక ఓటర్లను బెదిరిస్తున్నారని దీనివల్ల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సుధీర్ రెడ్డి, అతని అనుచరులను జూబ్లిహిల్స్ లోకి వచ్చేందుకు అనుమతి నిరాకరించాలని కోరారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పేర్కొన్నారు.

Next Story