ఎర్రబెల్లి దయాకర్​రావుపై ఈసీకి ఫిర్యాదు

by Gantepaka Srikanth |

ఎర్రబెల్లి దయాకర్​రావుపై ఈసీకి ఫిర్యాదు

ఎర్రబెల్లి దయాకర్​రావుపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) ఎన్నికల కోడ్​ఉల్లంఘించారంటూ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటి ఈసీకి ఫిర్యాదు చేసింది. గురువారం ఈ మేరకు ఆ కమిటీ చైర్మన్​పి.రాజేష్​కుమార్​ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎర్రబెల్లి దయాకర్​రావు బీఆర్ఎస్ జెండా చిన్న పిల్లలతో కలిసి నినాదాలు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన దయాకర్​రావుపైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను పొందుపర్చినట్లుగా రాజేష్ కుమార్​పేర్కొన్నారు.

Next Story