- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP MP అభ్యర్థి రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు
by GSrikanth |
మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీని చింతా ప్రభాకర్ కోరారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావుపై కీలక పాత్ర అని రఘునందన్ రావు ఆరోపించారు. అంతేకాదు.. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని రఘునందన్ రావు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
Next Story






