NHRC: ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు

by Ramesh Naini |

ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలోని వినోబా నవోదయ కాలనీలోని నిర్మించిన ఇళ్ల కూల్చివేతలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదైంది.

NHRC: ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలోని వినోబా నవోదయ కాలనీలోని నిర్మించిన ఇళ్ల కూల్చివేతలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కేసు నమోదైంది. ఈ విషయంలో ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ దర్యాప్తు చేపనట్టనుందని ఫిర్యాదు దారు, అడ్వకేట్ ఇమ్మనేని రామారావు తెలిపారు. వెలుగుమట్ల గ్రామంలో గల భూదాన్ భూములపై గతంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించిదని పేర్కోన్నారు. భూదాన్ ప్రాథమిక ఉద్దేశ్యం పేదలకు భూములు, పేదలు ఇల్లు కట్టుకున్న భూములపై నిషేధం లేదని తెలిపారు.

దాదాపు 6 వందల పేదల ఇళ్లు కూలగొడుతూ విధ్వంసం సృష్టించిన కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్‌సి ఫిర్యాదులో పేర్కోన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ కోరారు. వివాదాస్పద భూమి విలువ బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జిల్లా మంత్రికి సన్నిహితులుగా ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినోబా కాలనీ సమీపంలో రియల్ ఎస్టేట్ వెంచర్‌లు చేస్తున్నారని అందువల్ల ఇళ్ల కూల్చివేత జరిగిందిని ఆరోపిస్తూ ఫిర్యాదులో వివరించారు.

Next Story