- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
బీజేపీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. సోమవారం టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ ఛైర్మన్, పి. రాజేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ కి చేసిన ఫిర్యాదులో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధులను సర్పంచ్‌లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామా అభివృద్ధికి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తానని ఆదివారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని, కోడ్ ను ఉల్లంఘించిన కొండా వివేశ్వర్ రెడ్డి ప్రకటనపైన వెంటనే దర్యాప్తు చేయాలని, ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాజేష్ కుమార్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రకటనలు చేయకుండా ఆయనను ఆదేశించాలని, ఎంపీ ప్రకటనకు సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతో జతపరుస్తున్నట్లుగా ఆయన తెలిపారు.






