- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmaar Mallanna) ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేస్తున్న వివాదస్పద విమర్శల పట్ల రెడ్డి సంఘాల (Reddy Community) మండిపడుతున్నాయి. బీసీ కులాల సమావేశాల్లో రెడ్లను దూషిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmaar Mallanna) ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేస్తున్న వివాదస్పద విమర్శల పట్ల రెడ్డి సంఘాలు(Reddy Community) మండిపడుతున్నాయి. బీసీ కులాల సమావేశాల్లో రెడ్లను దూషిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 28న వరంగల్ (Warangal) వేదికగా నిర్వహించిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కుక్కలతో పోలుస్తూ దూషించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ పోలీసులకు రెడ్డి మహిళా సంఘం నేతలు ఫిర్యాదు చేయగా.. మంగళావారం డీజీపీ(DGP) జితేందర్ ను కలిసిన రెడ్డి సంఘం నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు (Complaint Filed)చేశారు. బబ్బూరి వెంకటేష్ ఆధ్వర్యంలో రెడ్డి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓట్లు కూడా వేశామన్న సంగతి మరువరాదని వారు పేర్కొన్నారు.
మల్లన్న సీఎం, పీఎం ఏదైనా మాకు అభ్యంతరం లేదని..మా కులాన్ని అవమానిస్తే మాత్రం సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లన్న వ్యవహారంపై వెంటనే స్పందించాలని వారు కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రెడ్డి కులానికి మల్లన్న క్షమాపణలు చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘాల నేతలు తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాహటంగానే మల్లన్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గెలుపు కోసం మేము రెండు సార్లు డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశామన్నారు. ఏదైనా అంశంపైన విమర్శలు చేసిన హుందాగా ఉండాలని హితవు పలికారు. అటు తీన్మార్ మల్లన్న తీరుపై పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. కులగణనపై తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు సరిగా లేవని..కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరమన్నారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని..ఎంతటివారైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తగు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.






