Banjara Hills PS: సీఎం రేవంత్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.

Banjara Hills PS: సీఎం రేవంత్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ తాతా మధు సీఎంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌(Banjara Hills PS)లో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లు కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌‌ను అసభ్య పదజాలంతో దూషించారని, ముక్కలు, ముక్కలు చేస్తామని సీఎం, మంత్రి వ్యాఖ్యలు చేశారని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌‌లో కోరారు.

Next Story